వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఏపీ విద్యార్థులకు స్థానం..,.మంత్రి నారా లోకేశ్ హర్షం
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానం దక్కించుకోవడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
Nara Lokesh

అమరావతి, 02 అక్టోబర్ (హి.స.)

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానం దక్కించుకోవడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో 170 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు.

35 వేల మంది విద్యార్థులు దాదాపు 75,000 కిలోల పొడి చెత్తను సేకరించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande