
హైదరాబాద్ , 02 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్ నగర పాలనలో కీలక మార్పులకు దారితీసే Core Urban Region (Integrated Governance) Act, 2026 అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 12న తెలంగాణ శాసనసభ ఆమోదించిన ఈ చట్టం పాత GHMC చట్టానికి బదులుగా కొత్త పట్టణ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడింది.
అక్టోబర్ 2న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టం అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
CURE పరిధిలో ORR లోపల ఉన్న సుమారు 2,053 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించిన విస్తృత పట్టణ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది.
కొత్త వ్యవస్థలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు — GHMC, Cyberabad Municipal Corporation, Malkajgiri Municipal Corporation — ఏర్పాటు చేయనున్నారు.
పాత GHMC చట్టం రూపొందిన సమయంలో హైదరాబాద్ జనాభా చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం నగరం విస్తరించడంతో ట్రాఫిక్, వరదలు, చెరువుల సంరక్షణ, మురుగు కాలువలు, రోడ్లు, అక్రమ నిర్మాణాలు, పర్యావరణం వంటి సమస్యలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో విస్తృత పట్టణ ప్రాంతానికి సమన్వయంతో కూడిన పాలనా వ్యవస్థ అవసరమనే ఉద్దేశంతో CURE చట్టాన్ని తీసుకొచ్చారు.
ఆస్తి పన్ను విధానంలో కూడా మార్పు వస్తుంది. పాత ఆన్య్వుయల్ రేట్ విధానానికి బదులుగా కాపిటల్ వాల్య్యూను ప్రవేశపెట్టనున్నారు. అక్టోబర్ 2 నుంచి కొత్తగా నిర్మించిన, ఇంకా పన్ను అంచనా వేయని ఆస్తులకు CVS వర్తించనుంది. ఇప్పటికే ఉన్న ఆస్తులకు కొత్త విధానం 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పన్ను మార్పు సమయంలో సంవత్సరానికి పెరుగుదలను 10 శాతానికి పరిమితం చేసే నిబంధన కూడా చట్టంలో ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్