
హైదరాబాద్ , 02 అక్టోబర్ (హి.స.)తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న రెండు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) వాయిదాలను ప్రభుత్వ ఉద్యోగులకు విడుదల చేయడంతో పాటు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఉద్యోగ, పెన్షనర్ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. పెండింగ్లో ఉన్న డీఏలకు సంబంధించిన బకాయిలను విడతల వారీగా చెల్లించనున్నారు.
ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగుల వాస్తవ ఆదాయంపై పడుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు డీఏ కీలకంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో డీఏ ఒక ముఖ్యమైన భాగం. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగులకు కొంత ఉపశమనం కల్పించేందుకు దీనిని సవరించడం జరుగుతుంది. తెలంగాణలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డీఏలపై ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ నిర్ణయం ప్రాధాన్యం పొందింది. కేబినెట్ సమావేశంలో డీఏ అంశంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరవు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లు, విద్యుత్ అవసరాలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్