జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏసీబీ దాడులు - లంచం డిమాండ్ చేసిన అధికారులు అరెస్ట్
రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Acb


హైదరాబాద్ , 23 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న అవినీతి ఉదంతం కలకలం రేపింది. పీఎం కృషి సించాయ్ యోజన (PMKSY) పథకం పనులకు సంబంధించిన నిధుల మంజూరు మరియు బిల్లుల బదిలీ వ్యవహారంలో ఒక కాంట్రాక్టర్ నుంచి భారీగా లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. బాధితుడు ఇచ్చిన కచ్చితమైన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి జిల్లా కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సంబంధిత అధికారులు రూసా పనులకు బిల్లులు వేసేందుకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారుల వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకుని, వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఏమాత్రం భయం లేకుండా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande