మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్కు అనధికారిక నీటి మళ్లింపు - విచారణ జరపాలంటూ ఇరిగేషన్ శాఖకు లేఖ
సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్కు సాగునీటి ప్రాజెక్టుల నుంచి అనధికారికంగా, అక్రమంగా నీటిని మళ్లించారన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Mp


సిద్దిపేట , 23 అక్టోబర్ (హి.స.)సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్కు సాగునీటి ప్రాజెక్టుల నుంచి అనధికారికంగా, అక్రమంగా నీటిని మళ్లించారన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై సమగ్రమైన మరియు నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ ఉన్నతాధికారులకు అధికారికంగా ఒక లేఖను సమర్పించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని నిధులను, నీటిని దుర్వినియోగం చేశారని ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీనిపై వెంటనే స్పందించి వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పరిణామంతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande