
తిరువనంతపురం, 24 అక్టోబర్ (హి.స.)
కేరళం రాష్ట్ర గవర్నర్ అధికార నివాసమైన లోక్భవన్ వంటగదిలో నాన్ వెజ్ వంటకాలు తయారు చేయకూడదని ఆదేశించినట్లు వచ్చిన వార్తలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆహారపు అలవాట్లను ఇతరులపై రుద్దడం సరికాదని విమర్శించారు.
కేరళలో శాకాహారం, మాంసాహారానికి సంబంధించిన విభిన్న ఆహార సంస్కృతులు ఉన్నాయని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. తీర ప్రాంత రాష్ట్రమైన కేరళంలో చేపల వంటకాలకు ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు. ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నారని అన్నారు. కాగా కేరళం గవర్నర్ గా ఓం ప్రకాశ్ మాథుర్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే రాజకీయ వివాదం తెరపైకి రావడం విశేషం.. ఈ ఆరోపణలను రాజకీయ విమర్శల్లో భాగం బాగా చేసిన కేసి వేణుగోపాల్ ఈ నిర్ణయం సంఘ్ పరివార్ భావజాలాన్ని అమలు చేసే ప్రయత్నంలో భాగమని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..