పోలీస్ అమరవీరుల ప్రాముఖ్యతను వివరించిన కరీంనగర్ సీపీ
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు.
Cp


కరీంనగర్, 25 అక్టోబర్ (హి.స.)

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం రోజు నగరంలో నిర్వహించిన 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని పోలీస్ కమీషనర్ జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమ అనంతరం ర్యాలీలో పాల్గొన్న సభ్యులకు సీపీ అమరవీరుల దినోత్సవn ప్రాముఖ్యతను వివరించారు.

కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande