నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై సీఎంను కలిసిన పార్టీ నేతలు
నిజామాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
Nizamabad


నిజామాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

నిజామాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా వారు ఆర్సపల్లి లో నిర్మించనున్న ఓవర్బ్రిడ్జి మరియు మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి పనులకు అవసరమైన నిధుల కేటాయింపుపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ఈ నిర్మాణాలు పూర్తయితే నిజామాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, రాకపోకలు సులభతరం కానున్నాయని వారు ముఖ్యమంత్రికి వివరించారు.

వారి విజ్ఞప్తులపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి, రెండు బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల మంజూరుకు అంగీకరించినట్లు నేతలు వెల్లడించారు. వీటితోపాటు జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande