జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం: రియాసి వద్ద మినీ బస్సు బోల్తా పడి ఐదుగురికి తీవ్ర గాయాలు
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం: రియాసి వద్ద మినీ బస్సు బోల్తా పడి ఐదుగురికి తీవ్ర గాయాలు
accident


జమ్మూ:, 25 అక్టోబర్ (హి.స.)

జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా జ్యోతిపురం సమీపంలో ఒక మినీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బస్సు అతివేగంగా రావడం వల్లే నియంత్రణ కోల్పోయి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande