
అమరావతి , 27 అక్టోబర్ (హి.స.)
ఆర్నబ్ తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పోలవరం జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లాలోని ప్రతి మండలంలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలకు అత్యవసర సమయంలో సహాయం అందించడంతో పాటు, వాతావరణ పరిస్థితులపై సమాచారాన్ని సేకరించి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తుపాను ప్రభావం నేపథ్యంలో తూర్పు గోదావరి, పోలవరం జిల్లాల్లో నేడు, రేపు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచించే జాగ్రత్తలను పాటించాలని యంత్రాంగం సూచించింది.
రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను 08832-944455 నంబర్లో సంప్రదించవచ్చు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 08832-442344.
అలాగే తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు కోనసీమ జిల్లాలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్లో 08856-293104, అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో 08856-233208, రామచంద్రాపురం ఆర్డీవో కార్యాలయంలో 08857-245166 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. కొత్తపేట ఆర్డీవో కార్యాలయంలో 8500238258, 08855-244299 నంబర్లను అందుబాటులో ఉంచారు.
తుపాను సమయంలో అత్యవసర సహాయం అవసరమైన వారు సంబంధిత కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్