
హైదరాబాద్ / విశాఖపట్నం: ', 28 అక్టోబర్ (హి.స.)
ఆర్నబ్' తీవ్ర తుఫాను కోస్తాంధ్రలో విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరియు తూర్పు తీర రైల్వే శాఖలు అత్యంత అప్రమత్తమయ్యాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో నడిచే 101కి పైగా రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని పాక్షికంగా రద్దు, రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
తీరప్రాంతాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీస్తుండటం, భారీ వర్షాలతో రైల్వే ట్రాక్ లపైకి నీరు చేరే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రద్దయిన ప్రధాన రైళ్ల వివరాలు:
-
వందే భారత్ ఎక్స్‌ప్రెస్: సికింద్రాబాద్ - విశాఖపట్నం (20707/20708) మరియు విశాఖపట్నం - సికింద్రాబాద్ (20833/20834) వందే భారత్ రైళ్లు రద్దయ్యాయి.
-
ప్రధాన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు: గోదావరి ఎక్స్‌ప్రెస్ (హైదరాబాద్ - విశాఖపట్నం), గౌతమి ఎక్స్‌ప్రెస్ (లింగంపల్లి - కాకినాడ పోర్ట్), ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ - హౌరా), విశాఖ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ - భువనేశ్వర్), రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం - విజయవాడ), గరీబ్ రథ్ (సికింద్రాబాద్ - విశాఖపట్నం), మరియు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం - గుంటూరు) రైళ్లను నిలిపివేశారు.
-
ప్యాసింజర్ & మెము రైళ్లు: విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గుంటూరు, రేపల్లె మధ్య నడిచే 50కి పైగా లోకల్ మరియు ప్యాసింజర్ సర్వీసులను రద్దు చేశారు.
ప్రయాణికులకు సూచన – పూర్తి రీఫండ్:
రైళ్ల రద్దు సమాచారాన్ని ప్రయాణికుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతున్నట్లు అధికారులు ತಿಳించారు. ఆన్లైన్ (IRCTC) ద్వారా బుక్ చేసుకున్న ఈ-టిక్కెట్లకు పూర్తి డబ్బులు వాటంతట అవే ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని, కౌంటర్ టిక్కెట్లు కలిగిన వారు రిజర్వేషన్ కౌంటర్లలో టిక్కెట్లను రద్దు చేసుకుని రీఫండ్ పొందవచ్చని స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు 'నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్' (NTES) యాప్ లేదా 139 హెల్ప్‌లైన్ ద్వారా రైళ్ల స్థితిని సరిచూసుకోవాలని రైల్వే శాఖ కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi