అంతర్వేది తీరంలో చిక్కుకున్న నౌక: క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించిన మెరైన్ అధికారులు!
అంతర్వేది తీరంలో చిక్కుకున్న నౌక: క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించిన మెరైన్ అధికారులు!
కార్గో


అంతర్వేది/అమరావతి: ', 29 అక్టోబర్ (హి.స.)

ఆర్నబ్' తుఫాను ఉధృతికి నిన్న దారితప్పి అంతర్వేది సముద్ర తీరం వద్ద నిలిచిపోయిన సల్ఫర్ లోడ్ కార్గో నౌక వద్ద అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. నౌక నిలిచిన ప్రాంతంలో సముద్ర అలల ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో, ప్రమాద తీవ్రతను అంచనా వేసేందుకు మెర్కంటైల్ మెరైన్ డిపార్ట్‌మెంట్ (MMD) సర్వేయర్లు మరియు పోర్టు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.

విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఈ భారీ కార్గో నౌక, గాలివాన తీవ్రతకు ఇంజిన్ ఫెయిల్ కావడంతో పాటు తీవ్రమైన సముద్ర ప్రవాహాల ధాటికి అదుపుతప్పి అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చింది. MMD సర్వేయర్ ధర్మశాస్త వెల్లడించిన వివరాల ప్రకారం, నౌక దెబ్బతిన్న తీరును, దాని లోపలి యంత్రాల పరిస్థితిని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే తదుపరి రెస్క్యూ మరియు రికవరీ చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.

నౌకలోని సరుకు (సల్ఫర్) లేదా ఇంధనం లీకేజీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ముప్పు నమోదు కాలేదని, పరిస్థితిని సముద్ర భద్రతా అధికారులు మరియు పోర్టు వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande