
విశాఖపట్నం:, 29 అక్టోబర్ (హి.స.)
'ఆర్నబ్' తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటం, కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో నడిచే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని పాక్షికంగా రద్దు (షార్ట్ టెర్మినేషన్) మరియు దారి మళ్లింపు చేసింది.
విశాఖపట్నం-కిరండూల్, విశాఖపట్నం-కోరాపుట్, విజయవాడ-మచిలీపట్నం, రూర్కెలా-జగదల్పూర్ మార్గాల్లో వెళ్లే పలు రైలు సర్వీసులను నవంబర్ మొదటి వారం వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-కోరాపుట్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నవంబర్ నాలుగు వరకు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే మరియు సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించాయి.
భువనేశ్వర్-జగదల్పూర్ హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ను రాయగడ వరకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే జగదల్పూర్ నుంచి బయలుదేరే రిటర్న్ రైలు జగదల్పూర్కు బదులుగా రాయగడ నుంచే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
ట్రాక్‌ల వద్ద పరిస్థితిని రైల్వే ఇంజనీరింగ్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లలో తాజా సమాచారాన్ని సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi