విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం....స్టార్టప్లపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త పంథాను ఎంచుకుంది.
విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం.స్టార్టప్లపై ప్రత్యేక దృష్టి


విశాఖపట్నం,, 07 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త పంథాను ఎంచుకుంది.

ఉత్తరాంధ్ర వేదికగా విశాఖ ఐఐఎంలో 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సును నిర్వహించారు.

ఈరోజు(బుధవారం) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీలు ఎం.శ్రీ భరత్, కలిశెట్టి అప్పలనాయుడు.. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కేవలం ఎంఓయూలు , పెట్టుబడుల సంతకాలే ధ్యేయం కాకుండా.. అంతర్జాతీయ స్థాయి జ్ఞానాన్ని పంచుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు.

ఈ సదస్సుల ద్వారా యువతలో సరికొత్త ఆలోచనలను రేకెత్తించాలని, టెక్నాలజీ రంగంలో గ్లోబల్ ఛాంపియన్లుగా ఎదిగేలా గైడెన్స్ ఇవ్వాలని సూచించారు. విదేశీ ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే ఈ సదస్సులలో స్టార్టప్ కంపెనీలకు, సరికొత్త ఆవిష్కరణలకు అగ్రతాంబూలం ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆలోచనలకు ఈ వేదికలు ఊతమివ్వాలని.. నేటి తరం యువత భాగస్వామ్యాన్ని ఇందులో భారీగా పెంచాలని సూచించారు.

‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్లు, పెట్టుబడిదారులను సదస్సు అనుసంధానించనుంది. ఈ సదస్సులో రూ.4,249 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ల ద్వారా 23,256 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 30 పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రాంతీయ సదస్సులో మరో 30 పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు(ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande