గోవర్ధన్ పూజ సందర్భంలో ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ మరియు ఇతర నేతల శుభాకాంక్షలు
గోవర్ధన్ పూజ సందర్భంలో ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ మరియు ఇతర నేతల శుభాకాంక్షలు
Vice President C. P. Radhakrishnan(File)


న్యూఢిల్లీ, 10 నవంబర్ (హి.స.)

గోవర్ధన్ పూజ శుభసందర్భంగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు మంగళవారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, సమృద్ధి, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 'X' (ట్విట్టర్) వేదికగా సందేశం ఇస్తూ... శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సమృద్ధి మరియు ధనాత్మక ఆలోచనలను ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ పండుగ భక్తి, కృతజ్ఞత, సామాజిక సామరస్య విలువలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ... ఈ పవిత్ర పర్వదినం ప్రజల జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని, శక్తిని నింపాలని కోరుకున్నారు. అందరికీ శుభం, సంతోషం, అభివృద్ధి కలగాలని ప్రార్థించారు. గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకుని వ్రజ ప్రజలను రక్షించిన శౌర్యమూర్తి, భక్తుల భయాలను తొలగించే శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ ఒక భక్తి శ్లోకాన్ని పంచుకున్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ... ఈ పండుగ ప్రకృతి, వ్యవసాయం, గోసంరక్షణ మరియు సాంప్రదాయ సంస్కృతి పట్ల భారతదేశానికి ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడి గాథ ప్రకృతి రక్షణ, ఐక్యత, జీవుల పట్ల దయ కలిగి ఉండాలనే శాశ్వత సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. గ్రామీణ సంస్కృతి, వ్యవసాయ పద్ధతులు, పశుసంపద ప్రాధాన్యతను పునరుద్ఘాటించే అవకాశాన్ని ఈ పండుగ కల్పిస్తుందని చెప్పారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... శ్రీకృష్ణుడితో ముడిపడి ఉన్న ఈ పండుగ ప్రకృతి పట్ల బాధ్యతను, ఆహార ప్రాముఖ్యతను మరియు గోవుల సంరక్షణను గుర్తుచేస్తుందన్నారు. కృతజ్ఞత, ఐక్యత మరియు సమాజ సంక్షేమ విలువలను స్వీకరించడానికి ఈ సమయం అందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో అందరి జీవితాల్లో ఆనందం, పురోగతి నిండాలని ఆకాంక్షించారు.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూ... వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, పశుసంపద అభివృద్ధి మరింత పురోగమించాలని కోరుకున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, గోకుల రక్షకుడు, గోవర్ధనధారి అయిన శ్రీకృష్ణుడి సేవలను స్మరించుకున్నారు. పర్యావరణాన్ని రక్షించడం, పశువులను గౌరవించడం మరియు అన్నదాతలకు కృతజ్ఞతలు తెలపడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఇల్లూ ధాన్యంతో, సమృద్ధితో తులతూగాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande