ఏపీ, ఒడిశా తీరాలకు తుఫాన్ అక్వాన్ ముప్పు
బంగాళాఖాతంలో తుఫాన్ అక్వాన్ కొనసాగుతోంది. ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాన్ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఏపీ, ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
karnataka-weather-update-bengaluru-cloudy-rain-coastal-districts


అమరావతి , 19 నవంబర్ (హి.స.)

బంగాళాఖాతంలో తుఫాన్ అక్వాన్ కొనసాగుతోంది. ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాన్ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఏపీ, ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం అక్వాన్ తుఫాన్ నర్సాపూర్కు 470 కిలోమీటర్లు, కళింగపట్నానికి 490 కిలోమీటర్లు, చెన్నైకి 560 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు నర్సాపూర్ నుంచి పూరి మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపైనా తుఫాన్ ప్రభావం పడనుంది.

తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రెడ్ అలర్ట్ నేపథ్యంలో సంబంధిత యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande