భారత నౌకాదళంలోకి 8 అత్యాధునిక యుద్ధనౌకలు: రూ.53,866 కోట్ల మెగా రక్షణ ఒప్పందం
భారత నౌకాదళంలోకి 8 అత్యాధునిక యుద్ధనౌకలు: రూ.53,866 కోట్ల మెగా రక్షణ ఒప్పందం
navy


ఢిల్లీ, 02 నవంబర్ (హి.స.)

భారత నౌకాదళ పోరాట పటిమను మరింత పెంచే

దిశగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీలో 8 అత్యాధునిక ‘నెక్స్ట్

జనరేషన్ కార్వెట్లు’ (NGCs) నిర్మించేందుకు భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.మొత్తం రూ.53,866.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్

అండ్ ఇంజనీర్స్' (GRSE), 'గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్'

(GSL) సంస్థలు దక్కించుకున్నాయి.

ఒప్పందంలో భాగంగా జీఆర్‌ఎస్‌ఈ (GRSE) 5

యుద్ధనౌకలను, జీఎస్‌ఎల్ (GSL) 3 యుద్ధనౌకలను తయారు చేయనున్నాయి.విదేశీ సాంకేతికతపై

ఆధారపడకుండా, పూర్తిగా భారత నౌకాదళమే స్వయంగా ఈ నెక్స్ట్ జనరేషన్

యుద్ధనౌకలకు రూపకల్పన (In-house Design) చేయడం ప్రాజెక్టులోని విశేషం.

ఈ నెక్స్ట్ జనరేషన్ కార్వెట్లు ఉపరితల, గగనతల మరియు అంతర్జల

(Anti-Submarine) రక్షణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే అధునాతన క్షిపణులు, రడార్లు, సోనార్ వ్యవస్థలతో

రూపుదిద్దుకోనున్నాయి.సముద్ర వాణిజ్య మార్గాల భద్రత,

తీర ప్రాంత రక్షణ మరియు నిఘా చర్యలకు

ఇవి కీలకంగా మారనున్నాయి. 'ఆత్మనిర్భర్ భారత్'

మరియు 'మేక్ ఇన్ ఇండియా'

పిలుపులో భాగంగా చేపట్టిన ఈ భారీ

ప్రాజెక్టు ద్వారా వచ్చే పదేళ్లలో షిప్‌యార్డులు,

అనుబంధ పరిశ్రమలు మరియు MSME రంగానికి

లక్షలాది పనిదినాల ఉపాధి లభించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande