వెస్టిండీస్ భారీ విజయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి నేపాల్ ఎలిమినేట్
హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి మరో జట్టు ఎలిమినేట్ అయింది. ఈ రోజు ఉదయం వెస్టిండీస్- నేపాల్ జట్ల మధ్య 27వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో వెస్టిండీస్ జట్టు భారీ విజయం సాధించింది. దీంతో తన ఆధిపత్యాన్ని చాటుతూ సూపర్-8 కు దూసుక
క్రికెట్


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)

టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి మరో

జట్టు ఎలిమినేట్ అయింది. ఈ రోజు ఉదయం వెస్టిండీస్- నేపాల్ జట్ల మధ్య 27వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో వెస్టిండీస్ జట్టు భారీ విజయం సాధించింది. దీంతో తన ఆధిపత్యాన్ని చాటుతూ సూపర్-8 కు దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో విండీస్ సమిష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ (58) అర్ధ సెంచరీతో పోరాడగా, సోంపాల్ కామి (26*) రాణించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4 వికెట్లతో నేపాల్ వెన్నులో వణుకు పుట్టించాడు.

అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్, కేవలం 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ షాయ్ హోప్ (61 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, షిమ్రాన్ హెట్మెయిర్ (46 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ను త్వరగా ముగించారు. బ్రాండన్ కింగ్ (22) శుభారంభం ఇచ్చి పెవిలియన్ చేరినప్పటికీ, హోప్-హెట్మెయిర్ జోడీ మరో వికెట్ పడకుండా విండీసన్ను విజయతీరాలకు చేర్చింది. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-సి నుండి వరుసగా మూడు విజయాలు నమోదు చేసి.. 6 పాయింట్లతో సూపర్-8 బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకున్న మొదటి జట్టుగా నిలిచింది. మరోవైపు, ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైన నేపాల్, గ్రూప్ దశ నుండే ఇంటిబాట పట్టింది. అద్భుతమైన ఫామ్లో ఉన్న విండీస్ జట్టు ఇదే ఊపుతో సూపర్-8లోనూ సత్తా చాటాలని చూస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande