
హైదరాబాద్, 16 ఫిబ్రవరి (హి.స.)
టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్
ఘనవిజయం సాధించింది. ఈ ఉత్సాహం కేవలం భారత సరిహద్దులకే పరిమితం కాకుండా పొరుగు దేశాల్లోనూ పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఆఫ్గనిస్తాన్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి భారత విజయాన్ని తమ సొంత గెలుపుగా భావిస్తూ సంబరాలు జరుపుకున్నారు. భారత్ గెలవగానే అక్కడ బాణసంచా కాల్చుతూ, పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ స్థానిక ప్రజలు చేసిన సందడికి సంబంధించిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అంతర్జాతీయంగా
ఈ వేడుకలు కేవలం క్రీడాభిమానాన్ని మాత్రమే కాకుండా, పాకిస్తాన్లోని ప్రస్తుత పరిస్థితులు, ఆ దేశంపై అక్కడి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బలూచ్ ప్రజలు తమపై జరుగుతున్న అణచివేతకు నిరసనగా, పాకిస్తాన్ ఓటమిని ఒక పండుగలా జరుపుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే ఆఫ్గనిస్తాన్ ప్రజలు కూడా భారత్తో ఉన్న తమ స్నేహపూర్వక బంధాన్ని చాటుకుంటూ భారత్ సాధించిన ఈ విజయాన్ని ఘనంగా వేడుక చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..