
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. పాకిస్థాన్‌పై 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ప్రదర్శనతో తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. 732 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు.
పలు అనివార్య కారణాల వల్ల దాదాపు రెండేళ్లుగా భారత జట్టుగా ఇషాన్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశవాళీల్లో నిలకడగా రాణిస్తూ అద్భుతమైన ఫామ్ కనబరుస్తుండటంతో భారత సెలెక్టర్లు ఇషాన్ వైపు చూశారు. దీంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌తో ఇషాన్ రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు డకౌట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం 891 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ 808 పాయింట్లతో ఉన్నాడు. కాగా భారత్ తరఫున టాప్-10లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. శ్రీలంక బ్యాటర్ నిస్సాంక ఆస్ట్రేలియాపై శతకంతో మూడో స్థానానికి ఎగబాకడం విశేషం.
బౌలర్లలో వరుణ్ ఆధిపత్యం
ఐసీసీ బౌలింగ్ జాబితాలో భారత్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఎవాన్స్ 10 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు. ఇతర భారత బౌలర్లలో అక్షర్ పటేల్(14), బుమ్రా (15), అర్ష్‌దీప్ సింగ్ (16) స్థానాల్లో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్