ఫేక్ న్యూస్ పై ట్రంప్ ఫైర్.. జనరల్ కేన్ పై ప్రశంసల జల్లు!
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.) ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా సైనిక నాయకత్వంతో ట్రంప్ (Trump)కు విభేదాలు ఉన్నాయని అనేక వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖ
President Trump


హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)

ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా సైనిక నాయకత్వంతో ట్రంప్ (Trump)కు విభేదాలు ఉన్నాయని అనేక వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జనరల్ డేనియల్ కేన్ (జనరల్ రజిన్) ఇరాన్పై సైనిక చర్యను వ్యతిరేకిస్తున్నారని మీడియాలో వస్తున్న కథనాలు 100 శాతం అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా యుద్ధం ఇష్టం ఉండదని, అయితే ఒకవేళ సైనిక చర్య చేపట్టాల్సి వస్తే దానిని సులభంగా గెలవవచ్చని జనరల్ కేన్ అభిప్రాయపడినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

జనరల్ కేన్ సామర్థ్యాన్ని కొనియాడుతూ, గతంలో ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన 'ఆపరేషన్ మిడ్నైట్ హామర్ కు కు ఆయనే నాయకత్వం వహించారని ట్రంప్ గుర్తుచేశారు. అమెరికాకు చెందిన శక్తివంతమైన B-2 బాంబర్లు ఆ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశాయని, అటువంటి గొప్ప పోరాట యోధుడు దేశం కోసం ఏ క్షణమైనా నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ఇరాన్తో పరిమిత దాడులు, యుద్ధం చేయకూడదనే ఉద్దేశ్యం జనరల్ కేన్కు లేదని, ఆయనకు కేవలం గెలవడం మాత్రమే తెలుసని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

అంతిమంగా యుద్ధం- దౌత్యపరమైన ఒప్పందంపై నిర్ణయం తీసుకునే అధికారం తనకే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. తనకు ఇరాన్తో చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకోవడమే ఇష్టమని, కానీ ఒకవేళ అది చాలా సాధ్యం కాకపోతే ఇరాన్ దేశానికి అది దారుణమైన రోజు అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande