
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)
దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీ ఇంటెలీజెన్స్ విజయ్ కుమార్, ఎస్‌ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి (అప్రకటిత) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అలియాస్ కుమ్మదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు సాయుధ పోరాటాన్ని వదిలి డీజీపీ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు