దిల్లీ మద్యం కేసు.. నేను చెప్పిందే నిజమైంది: కవిత
న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత అన్నారు.
Kavitha


హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత అన్నారు. ఆమె నిందితురాలిగా ఉన్న దిల్లీ మద్యం కేసు (Delhi Liquor case)ను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.

‘‘నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదట్నుంచి చెబుతున్నాను. అలాగే వచ్చాను. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పాను. అదే నిజమైంది. దీంతో నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. కోర్టు తీర్పు రాకుండానే నాపై కొందరు అనుచితంగా మాట్లాడారు. కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను’’ అని కవిత అన్నారు. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ‘సత్యమేవ జయతే’ అని ‘ఎక్స్’లో ఆమె పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande