ఓటీటీలోనూ దుమ్మరేపుతున్న 'ధురంధర్'
ముంబై, 08 ఫిబ్రవరి (హి.స.)బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ ఓటీటీలోనూ సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ గ్లోబల్ టాప్ -10 నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ జాబితాలో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. ఇండి
dhurandhar-movie-streaming-sensation-on-ott-platforms


ముంబై, 08 ఫిబ్రవరి (హి.స.)బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ ఓటీటీలోనూ సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ గ్లోబల్ టాప్ -10 నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ జాబితాలో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. ఇండియాతో పాటు పాకిస్థాన్‌లోనూ ఈ మూవీకి విశేష ఆదరణ లభిస్తుండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన తాజా వీక్లీ నివేదిక ప్రకారం ‘ధురంధర్’ టాప్‌లో నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమాకు 7.6 మిలియన్ వ్యూస్ దక్కినట్లు వెల్లడించింది.

2025 డిసెంబరు 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తొలి షో నుంచే మౌత్ టాక్‌తో దూసుకెళ్లింది. సీక్రెట్ ఏజెంట్‌గా హీరో రణ్‌వీర్ సింగ్ లుక్స్, యాక్టింగ్‌తో పాటు విలన్‌గా అక్షయ్ ఖన్నా నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాకు ప్లస్‌గా మారాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రికార్డులు సృష్టించిన ‘ధురంధర్’ దాదాపు రూ.1400 కోట్ల కలెక్షన్లతో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ధురంధర్ 2’ కూడా సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్లు సమాచారం. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సీక్వెల్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కథలో ఒకటి రెండు కొత్త పాత్రలను జోడిస్తున్నట్లు బాలీవుడ్ టాక్. దర్శకుడు ఆదిత్యధర్ అదనపు మెరుగులు దిద్ది చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ‘ధురంధర్ 2’ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande