
హైదరాబాద్, 20 జూలై (హి.స.)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత
తాజాగా 'మా ఇంటి బంగారం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి, ఇప్పటివరకు ఏ తెలుగు లేడీ ఓరియెంటెడ్ చిత్రం సాధించని స్థాయి వసూళ్లను రాబట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం జియో హాస్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా ఈ సినిమా రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా జియో హాట్ స్టార్ సంస్థ 'మా ఇంటి బంగారం' ఓటీటీలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తోందని, ఈ సినిమాతో సమంత మరోసారి పలు అరుదైన ఘనతలను అందుకుంటోందని ప్రకటించింది. దీంతో ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ తన సత్తా చాటుతూ విజయవంతంగా దూసుకుపోతోందని చెప్పవచ్చు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వురు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..