మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి.. భారీగా పెరిగిన రేట్లు
ముంబై, 09 ఫిబ్రవరి (హి.స.) బంగారం వెండి ధరలు గడిచిన పదిరోజుల్లో భారీ హెచ్చు తగ్గులు నమోదు చేశాయి. బంగారం, వెండి ధరల పతనం కంటిన్యూ అవుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ.. కొనుగోలుదారులకు మళ్లీ షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం 24 క్
Gold


ముంబై, 09 ఫిబ్రవరి (హి.స.)

బంగారం వెండి ధరలు గడిచిన పదిరోజుల్లో భారీ హెచ్చు తగ్గులు నమోదు చేశాయి. బంగారం, వెండి ధరల పతనం కంటిన్యూ అవుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ.. కొనుగోలుదారులకు మళ్లీ షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.2050 పెరిగి రూ.1,45,600 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1680 పెరిగి రూ.1,19,130కి చేరింది.

వెండి కూడా బంగారంతో పోటీగా పెరిగింది. కిలో వెండి ధరపై రూ.15000 పెరగడంతో.. ప్రస్తుత ధర రూ.3,00,000లకు చేరింది. పెరిగిన బంగారం, వెండి ధరలకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటుంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

కొద్దిరోజుల్లో శుక్రమూఢం ముగిసి పెళ్లిళ్లు ప్రారంభం కానున్నాయి. వరుసగా ధరల పెరుగుదల తర్వాత.. బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తుండటంతో మరింత తగ్గుతాయని ఎదురుచూస్తున్నవారికి మళ్లీ ఊహించని షాక్ తగులుతోంది. బంగారం జ్యూవెలరీ కొనేటపుడు 22 క్యారెట్లలో వస్తుంది. దానిప్రకారం చూస్తే.. ఫిబ్రవరి 7, 9 తేదీల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.4700 (జీఎస్టీ, తరుగు లేకుండా) పెరిగింది. ఫిబ్రవరి 6న 10 గ్రాముల రేటు రూ.1,40,900 ఉంటే.. నేటికి దాదాపు రూ.5 వేల మేర పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande