మిల్లెట్స్ కిచిడి.. ఆరోగ్యానికి ఇదే బెస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది
కర్నూలు, 14 మార్చి (హి.స.)రోజూ ఉదయం మినపప్పుతో చేసిన టిఫిన్స్ తిన్నాము. అయితే, ఈ సారి కొత్తగా మిల్లెట్ కిచిడి ట్రై చేయండి. టమాటా, బంగాళాదుంపలు , బీన్స్ ఇలా వెజిటెబుల్స్ తీసుకుని రుచికరంగా చేసుకుని తినొచ్చు. మరి, దీనిని ఇక తయారు చేయాలంటే అయ్యేలా కలు
simple Breakfast recipes Indian how to m


కర్నూలు, 14 మార్చి (హి.స.)రోజూ ఉదయం మినపప్పుతో చేసిన టిఫిన్స్ తిన్నాము. అయితే, ఈ సారి కొత్తగా మిల్లెట్ కిచిడి ట్రై చేయండి. టమాటా, బంగాళాదుంపలు , బీన్స్ ఇలా వెజిటెబుల్స్ తీసుకుని రుచికరంగా చేసుకుని తినొచ్చు. మరి, దీనిని ఇక తయారు చేయాలంటే అయ్యేలా కలుపుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : మిల్లెట్స్ ఒక కప్పు కొర్రలు లేదా సామలు, ఒక కప్పు పెసరపప్పు, రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు టమాటాలు, క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బీన్స్, 4 పచ్చిమిర్చి, అల్లం, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, రెండు టీ స్పూన్స్ నెయ్యి, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా మీరు ఏవి తీసుకుంటే అవి కొర్రలు కానీ సామలు కానీ ఒక పాత్రలో తీసుకుని వాటిని బాగా శుభ్రపరచుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో ఆయిల్ వేసి అర జీలకర్ర, కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి ముక్కలు , అల్లం పేస్ట్ ను వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కూడా మగ్గించాలి.

ఇక ఇప్పుడు టమాటా, బంగాళాదుంపలు , బీన్స్ ఇలా అన్ని వెజిటెబుల్స్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిల్లెట్స్, పప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

చివర్లో రెండు గ్లాస్ లు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేవరకు మిల్లెట్స్ ను బాగా ఉడికించాలి. అది మొత్తం బాయిల్డ్ అయిన తర్వాత కిందకు దించేయండి. అంతే, వేడి వేడి మిల్లెట్స్ ఖిచిడీ. దీనిని పెరుగుతో తింటే రుచికరంగా ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande