హార్ముజ్ జలసంధి వివాదం..అమెరికాకు చైనా బిగ్ షాక్
న్యూఢిల్లీ, 17 మార్చి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ జల సంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని మిత్ర దేశాలు, చైనాకు అమెరికా అధ్యక
చైనా షాక్


న్యూఢిల్లీ, 17 మార్చి (హి.స.)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

నకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ జల సంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని మిత్ర దేశాలు, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు నేపథ్యంలో చైనా, మిత్ర దేశాలు ససేమిరా అన్నాయి.

ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలు అయిన ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్, జర్మనీలతో పాటు జపాన్ కూడా స్పష్టం చేసింది. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని సంచలన ప్రకటన చేశాయి. ముందు దాడులను ఆపాలని చైనా సూచనలు చేసింది. తమకు సహకరించకపోతే నాటోకు భవిష్యత్తు ఉండబోదని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ నాటో దేశాలు వెనక్కి తగ్గడం లేదు. మరి దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

తమ శత్రువులకు హార్ముజ్ జలసంధి క్లోజ్ గానే ఉంటుందని ఇరాన్ వెల్లడించింది. తమ మిత్ర దేశాలకు ఈ మార్గం ఎప్పటికీ ఓపెన్ గానే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande