వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మంత్రి అంజలి సత్య ప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు
అమరావతి, 17 మార్చి (హి.స.) :మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్( ) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున
వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మంత్రి అంజలి సత్య ప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు


అమరావతి, 17 మార్చి (హి.స.)

:మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్( ) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని విమర్శించారు. ‘అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ.. బాబాయ్ను చంపింది ఎవరో తెలిసినా సాక్ష్యాలు చెరిపేయడమే మీ పనా?’ అని ప్రశ్నించారు.

గుండెపోటు థియరీ నుంచి గొడ్డలి వేటు వరకు గంటకో మాట మార్చిన 'జగన్నాటకం' గూగుల్ టేకవుట్లో బట్టబయలైందని మంత్రి వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ వద్దని, నిందితుడు అవినాశ్ రెడ్డిని కాపాడటానికి బాంబులతో బెదిరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కన్నకూతురు సునీతమ్మపై అక్రమ సంబంధాల ముద్ర వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ కావాలన్నారు.. అధికారంలోకి వచ్చాక సీబీఐని తరిమికొట్టారు, ఇదేనా మీ నీతి’ అంటూ మంత్రి విరుచుకుపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande