
తిరుపతి, 02 మార్చి (హి.స.)
, :తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారు నగల కోసం వృద్ధురాలిని దుండగులు హత్య చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు కె.లక్ష్మమ్మగా(67) గుర్తించారు. టీటీడీలో రిటైర్డ్ అయిన ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ ఘటన జరిగింది. దుండగులు ఆమె గొంతును నులిమి, ఆ తర్వాత దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 100 గ్రాములకు పైగా బంగారు నగలను కాజేసి పరారయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ