అతి వేగం ముగ్గురి యువకుల ప్రాణాలు బలి తీసుకుంది
అమరావతి, 02 మార్చి (హి.స.) పెదపాడు: అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సును ఢీ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేట ఎఫ్సీఐ గోడౌన్స
అతి వేగం ముగ్గురి  యువకుల ప్రాణాలు బలి తీసుకుంది


అమరావతి, 02 మార్చి (హి.స.)

పెదపాడు: అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సును ఢీ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేట ఎఫ్సీఐ గోడౌన్స్ సమీపంలో జరిగింది. ఏలూరు బీడీ కాలనీకి చెందిన ఈ ముగ్గురూ కూలి పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande