రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కృషి: సీఎం రేవంత్రెడ్డి
రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు
Revanthreddy


హైదరాబాద్, 22 మార్చి (హి.స.)రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ పెట్టారు.

రైతును ధైర్యంగా సాగులో నిలబెట్టేందుకు తాను భరోసా ఇస్తున్నానని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామ వేదికగా మరోసారి ‘మా పాలనలో - రైతే రాజు’ అని రుజువు చేస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక సాయం చేసి తాము చేతులు దులుపుకోవడం లేదని.. కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.

----------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande