
అమరావతి, 22 మార్చి (హి.స.)
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.
అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండ రామచంద్ర ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకు గజ వాహనంపై రాములవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు అధిక
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ