గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరింది.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్పూర్, 22 మార్చి (హి.స.) ఎన్నో ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం లింగాల గణపురం మండలం లోని రామచంద్ర గూడెం చెరువులోకి గోదావరి నీరు చేరడంతో ఎమ్మెల్యే పసుపు కుంకుమ పూల
ఎమ్మెల్యే కడియం


స్టేషన్ ఘన్పూర్, 22 మార్చి (హి.స.)

ఎన్నో ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం లింగాల గణపురం మండలం లోని రామచంద్ర గూడెం చెరువులోకి గోదావరి నీరు చేరడంతో ఎమ్మెల్యే పసుపు కుంకుమ పూలు చల్లి గంగమ్మ తల్లికి పూజ చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ.. గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం 20 లక్షల మంజూరు చేస్తానన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గుమ్మడవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి 1,50,000 ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆరు నెలల్లో కాలనీ వరకు బీటీ రోడ్డు తో పాటు లైటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పటేల్ గూడెం గ్రామంలో నీలం గోపాల్ నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించారు. ఎంతోమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతుంది అన్నారు. అసెంబ్లీలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని, రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కలేని విధంగా రాష్ట్రంలో ఒక కోటి 15 లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారు. వారికి దేశంలో ఎక్కడలేని విధంగా కుటుంబ పెద్ద కు 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించిందన్నారు.

అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మూడు రోజులు పాలు,మూడు రోజులు రాగి జావ అందించడంతోపాటు విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, జూనియర్ కళాశాలలో చదవిన విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చక్కటి ఆలోచన ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసేవారు.. అవకాశం వచ్చిన పనులు చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కల్వకుంట కుటుంబం ప్రజాధనం దోచుకుందే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పని చేసే వాడిని నమ్మాలి గాని, ప్రగల్భాలు పలికే వాడికి బుద్ధి చెప్పాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande