పారిశ్రామిక రంగంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ది చారిత్రాత్మక ఘట్టం:రామ్మోహన్
అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.
Rammohan naidu


అనకాపల్లి, 24 మార్చి (హి.స.)అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర తలరాతను మార్చనున్న మెగా స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇదని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్గా ఏపీ ప్రాజెక్ట్ రికార్డు సృష్టించనుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

లక్షలాదిమందికి పైగా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఏటా 17 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగనుందని వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషితో ఈ భారీ ప్రాజెక్ట్ సాకారమైందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఆర్సెలార్ మిట్టల్ - నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ ఇంజిన్గా మారనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande