సన్రైజర్స్ అభిమానులకు బిగ్ అలర్ట్.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కు టికెట్లు విడుదల!
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు (Sunrisers Hyderabad) మొదటి మ్యాచ్ ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అనంతరం రెండో మ్యాచ్ భాగ్యనగరంలో జరుగుతుంది. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్లో
Cricket


హైదరాబాద్, 26 మార్చి (హి.స.)

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు

(Sunrisers Hyderabad) మొదటి మ్యాచ్ ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అనంతరం రెండో మ్యాచ్ భాగ్యనగరంలో జరుగుతుంది. సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్లో జరిగే తొలి పోరుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ (Orange Army) ఆడే మొదటి మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు సన్రైజర్స్ యాజమాన్యం తీపి కబురు అందించింది. ఏప్రిల్ 5వ తేదీన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనున్న మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఇవాళ (మార్చి 26) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు 'SRH' అధికారికంగా ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande