టీమిండియా జట్టు ప్రాక్టీస్ కు చంద్ర గ్రహణం ఎఫెక్ట్..
ముంబై, 04 మార్చి (హి.స.) టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం జరిగే సెమీస్ ఇంగ్లాండ్ను టీమిండియా ఎదుర్కోనుంది. ఈ పోరు కోసం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టు సన్నద్ధమవుతుంది. అయితే మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. చంద్ర గ్రహణం కా
Grahanam


ముంబై, 04 మార్చి (హి.స.)

టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం జరిగే సెమీస్ ఇంగ్లాండ్ను టీమిండియా ఎదుర్కోనుంది. ఈ పోరు కోసం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టు సన్నద్ధమవుతుంది. అయితే మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది.

చంద్ర గ్రహణం కారణంగా టీమ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ను గంటపాటు వాయిదా వేసింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 :20 గంటలకు మొదలై సాయంత్రం 6:40 గంటలకు వరకూ ఉంది. ఈ సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచింది కాదని టీమ్ మేనేజ్మెంట్ భావించిందని సదరు వర్గాలు జాతీయ మీడియాతో తెలిపాయి. 'చంద్ర గ్రహణం సమయంలో మంచి పని చేయకుండా ఉండాలని జట్టు అనుకుంది. అది కూడా సెమీస్ వంటి కీలక మ్యాచ్కు ముందు. సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలని జట్టు భావించింది.

అందుకే ప్రాక్టీస్ సెషన్ను గంటపాటు వాయిదా వేయడానికి టీమ్ మేనేజ్మెంట్ అంగీకరించింది.'అని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో సాయంత్రం 6:40 గంటల తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande