లోయలో పడిన బస్సు.. జమ్మూకశ్మీర్లో 15 మంది మృతి
లోయలో పడిన బస్సు.. జమ్మూకశ్మీర్లో 15 మంది మృతి
లోయలో పడిన బస్సు.. జమ్మూకశ్మీర్లో 15 మంది మృతి


ఉధంపూర్20 ఏప్రిల్ (హి.స.)

జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని ఉధంపూర్లో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. రామ్నగర్ సమీపంలోని కాగోర్ట్ గ్రామం వద్ద ఉన్న మూలమలుపు దగ్గర బస్సు ప్రమాదానికి గురైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాద స్థలం నుంచి అనేక మందిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. రామ్నగర్ గ్రామం నుంచి ఉధంపూర్కు వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. మలుపు దగ్గర బస్సు లోయలోకి జారిపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. స్థానిక అధికారులతో టచ్లో ఉన్నట్లు ఆయన చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande