
అమరావతి, 21 ఏప్రిల్ (హి.స.)
తన పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.56.39 కోట్లు మంజూరు చేసే ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఏటా ఉగాది, కొత్త సంవత్సరం ప్రారంభం రోజున పేదలకు మేలు చేసే సీఎంఆర్ఎఫ్ ఫైలుపై తొలి సంతకం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీ. తన పుట్టిన రోజు సందర్భంగా అదే ఆనవాయితీని ఆయన కొనసాగించారు. 7,074 మందికి లబ్ధి చేకూర్చే రూ.56.39 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైలుపై సంతకం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో సీఎం సహాయనిధి నుంచి 1,43,314 మంది లబ్ధిదారులకు రూ.1,298.33 కోట్లు అందించారు. ఇక నిన్న సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. దీంతో ఎక్స్లో ‘హేపీ బర్త్డే వన్ అండ్ ఓన్లీ సీబీఎన్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ