
అనంతపురం, 21 ఏప్రిల్ (హి.స.)
అనంతపురం టౌన్లో ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. టమోటా మండి వద్ద నిద్రిస్తున్న రైతుపై కారు రివర్స్లో వెళ్లడంతో ఆయన మృతి ెందారు.
పోలీసుల వివరాల ప్రకారం, కుందిర్పి మండలానికి చెందిన చంద్రన్న (66) మామిడికాయలను విక్రయించేందుకు కక్కలపల్లి ఎస్ఆర్ఎఫ్ మార్కెట్కు వచ్చారు. ఉదయం వేలం ఉండటంతో మార్కెట్ ప్రాంగణంలోనే నిద్రిస్తున్నారు.
ఈ క్రమంలో మండి ప్రాంతంలో ఉన్న ఓ కారు రివర్స్లో వెళ్లడంతో నిద్రిస్తున్న రైతుపైకి వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే మార్కెట్ సిబ్బంది ఆయనను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మృతుడిని చంద్రన్నగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV