మొన్న ఏసీబీ... నేడు విజిలెన్స్జగిత్యాల మున్సిపాలిటీలో విస్తృత తనిఖీలు
మొన్న ఏసీబీ... నేడు విజిలెన్స్జగిత్యాల మున్సిపాలిటీలో విస్తృత తనిఖీలు
Vigilance


జగిత్యాల, 27 ఏప్రిల్ (హి.స.)

మొన్నటికి మొన్న ఏసీబీ దాడులతో కలకలం రేపిన జగిత్యాల మున్సిపాలిటీ... ఇప్పుడు విజిలెన్స్ తనిఖీలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. సోమవారం ఉదయం నుంచే విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. సుమారు 8 బృందాలుగా దాదాపు 60 మంది అధికారులతో జగిత్యాల మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. ముఖ్యంగా రెవెన్యూ సెక్షన్పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భవనాల అసెస్మెంట్లు, పన్నుల విధింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు నేరుగా భవనాల వద్దకే వెళ్లి కొలతలు తీస్తూ పరిశీలిస్తున్నారు.

పత్రాల్లో ఉన్న వివరాలు, భవనాల వాస్తవ పరిస్థితుల మధ్య తేడాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వరుస దాడులు జగిత్యాల మున్సిపల్ పాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజల్లో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎప్పటిలాగే తనిఖీలకే పరిమితం అవుతారా లేక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సి ఉండగా రాష్ట్రంలో మరే మున్సిపాలిటీ లో లేని విధంగా జగిత్యాల బల్దియా అవినీతి కేంద్ర బిందువుగా మారిందని పట్టణ ప్రజల్లో చర్చ నడుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande