
హైదరాబాద్, 27 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ భవన్లో లో సోమవారం బీఆర్ఎస్(BRS) ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై కేసీఆర్, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..దశాబ్దాలుగా అన్యాయనికి గురై నెత్తురు మండిన జాతి ఎత్తిన జెండానే గులాబీ జెండా అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగనప్పుడే సమస్యలకు చరమగీతం పాడవచ్చన్నారు. కేసీఆర్ 25 ఏండ్ల క్రితం జలదృశ్యంలో గులాబీ జెండా ఎత్తిపట్టారని గుర్తు చేశారు.
14 ఏండ్ల తన పోరాటంతో తెలంగాణ జాతిని ఐక్యం చేసి సబ్బండ వర్ణాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ కలను సాకారం చేశారన్నాను. సాధించిన తెలంగాణ కోసం అధికారం అప్పగిస్తే పదేండ్ల కాలంలో బాధ్యతగా పని చేసి అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు. కానీ, రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఆరాచక పాలన మొదలైందన్నారు. కాంగ్రెస పాలనకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల తరఫున పోరాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఏ బాధ్యత అప్పగించినా బీఆర్ఎస్ పార్టీ సమర్ధవంతంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని ప్రొ.జయశంకర్ అనేవారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ నుంచి రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడుదామన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్ను సీఎంగా చేసేదాకా దండుగా కదం తొక్కుదామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దిశానిర్దేశం కోసం గులాబీ దండు ఎదురుచూస్తోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..