నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స్పాట్ డెడ్
రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స్పాట్ డెడ్
Road to accident


నల్గొండ, 27 ఏప్రిల్ (హి.స.)

ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అద్దంకి - నార్కట్ పల్లి రహదారి నల్లగొండలోని పానగల్ ఫ్లైఓవర్ పై సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్ఐ యర్ర సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేట కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గంగసాని సాయి సందీప్ స్వగ్రామం నుంచి కారులో హైదరాబాద్ కు బయలుదేరాడు. ఉదయం 6:10 గంటల సమయంలో పానగల్ బైపాస్ ఫ్లైఓవర్ పై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో టూ టౌన్ సీఐ రాఘవులు, ఎస్ఐ సైదులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని, కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతికష్టంమీద బయటకు తీసి, ఓ ప్రైవేట్ అంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదే సమయంలో సాయి సందీప్ సెల్ కు ఫోన్ రావడంతో, సీఐ రాఘవులు వారికి ప్రమాద వార్త తెలిపారు. దీంతో అక్కడి నుంచి బాధిత కుటుంబీకులు నల్లగొండకు బయల్దేరారు. ఈ ఘోర ప్రమాదంలో కారు నుజ్జె.. మృతదేహం అందులోనే ఇరుక్కుని పోయింది. రక్తసిక్తమైన మృతదేహాన్ని బయటకు తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం తో, ఘటనాస్థలిలో ఉన్న సీఐ రాఘవులు, ఎస్ఐ సైదులు స్వయంగా మృతదేహాన్ని బయటకు తీసి, అంబులెన్స్ లో ఎక్కించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande