
ఢాకా07 ఏప్రిల్ (హి.స.)
బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జాతీయ పార్లమెంట్ మాజీ స్పీకర్ షిరీన్ షర్మిన్ చౌదరి ను ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కి చెందిన డిటెక్టివ్ బ్రాంచ్ (DB) సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. ఢాకాలోని ధన్మండి లో ఉన్న ఆమె నివాసంలో పోలీసులు ఈ సోదాలు నిర్వహించి, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు డీబీ అదనపు కమిషనర్ షఫీకుల్ ఇస్లాం ధృవీకరించారు.
2024 జూలైలో జరిగిన కోటా సంస్కరణల ఉద్యమం, ఆ తదుపరి హింసాకాండలో ఒక స్వర్ణకారుడి మరణానికి సంబంధించి రంగపూర్లో నమోదైన హత్య కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొన్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం అయిన తర్వాత, సెప్టెంబర్ 2, 2024న షిరీన్ షర్మిన్ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. ఈమె బంగ్లాదేశ్ పార్లమెంటుకు మొదటి మహిళా స్పీకర్గా 2013 నుండి 2024 వరకు సుదీర్ఘ కాలం పనిచేశారు. ప్రస్తుతం ఆమెను డీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV