కాపీ-పేస్ట్ చేస్తూ దొరికిపోయిన పాక్ ప్రధాని.. నెటిజన్ల ఎద్దేవా..
సోషల్ మీడియాలో పాక్ప్ర ధానిని ఏకీపారేస్తున్న నెట్టిజనులు
Pak pm


ఢిల్లీ , 08 ఏప్రిల్ (హి.స.)

ఓ పక్క అమెరికా- ఇరాన్ రెండు

వారాల కాల్పుల విరమణ (ceasefire) వేళ యావత్ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రధాని (Prime Minister of Pakistan) మాత్రం నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో చేసిన ఒక పొరపాటు నెట్టింట పెను దుమారం రేపుతోంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్కు విధించిన గడువును రెండు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ఆయన ఒక పోస్ట్ చేశారు. అయితే, ఆ మెసేజ్ను పంపేటప్పుడు దాని పైభాగంలో ఉన్న Draft - Pakistan's PM Message on X హెడ్డింగ్ను తొలగించడం మర్చిపోయారు. కొద్దిసేపటికే ఆ పొరపాటును గుర్తించి ఎడిట్ చేసినప్పటికీ, అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు పాకిస్తాన్ ప్రధానిని ఏకి పారేస్తున్నారు. అసలు ఆ మెసేజ్ ప్రధాని కార్యాలయం సొంతంగా రాసిందా? లేక ఎవరైనా పంపిన 'రెడీమేడ్' స్క్రిప్ట్ను అలాగే కాపీ పేస్ట్ చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆ మెసేజ్లో వాడిన భాష, డ్రాఫ్ట్ స్టైల్ చూస్తుంటే అది వైట్ హౌస్ (అమెరికా) నుంచి వచ్చిన సూచనలలా ఉన్నాయని, అమెరికా ఏం చెబితే పాక్ అదే చేస్తోందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

అమెరికా కీలుబొమ్మ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande