విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!
విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది
Bhatti vikramarka


హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)కేసీఆర్ హయాంలోని పదేళ్లు వనరులు దోపిడీకి గురికావటం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) ఎర్రుపాలెంలో అమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. అక్షరమే ఆయుధంగా ప్రతి విద్యార్థి ఎదగాలని ఆకాంక్షించారు. జూన్ 2వ తేదీ నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రతి బిడ్డకు ఉచితంగా మెరుగైన విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 100 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుడతామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మధిర నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో చివరి భూములకు సాగునీరు అందించాలన్నదే తన సంకల్పమని తెలిపారు. రూ.36 కోట్లతో కట్టలేరు కాలువల మరమ్మతులను చేపట్టామని అన్నారు. ఎన్నెస్పీ కెనాల్ మూడవ జోన్ పరిధిలో ఉన్న భూములను రెండవ జోన్ కిందకు తీసుకువచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందజేస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్ట్ను గాలికొదిలేశారని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande