ఢిల్లీలో ఐఎస్ఐ-అండర్ వరల్డ్ ఉగ్రవాద ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్!
ఢిల్లీలో ఐఎస్ఐ-అండర్ వరల్డ్ ఉగ్రవాద ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్!
Gang arrest


న్యూఢిల్లీ, 30 మే (హి.స.)

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ

(ISI), ముంబై అండర్వరల్డ్ నెట్వర్క్ సంబంధాలున్న ఒక భారీ ఉగ్రవాద ముఠా (Terror Module) గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా తొమ్మిది మంది (9) అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు (Terrorists arrested) చేసినట్లు శనివారం (మే 30) ఒక అధికారి వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని కీలక ప్రాంతాలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు ఈ ముఠా భారీ వ్యూహం పన్నినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఈ ఉగ్రవాద ముఠా కదలికలపై నిఘా ఉంచిన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం (Special Cell), పక్కా సమాచారం, పటిష్టమైన నిఘా ఆధారంగా ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకుంది. సుదీర్ఘ విచారణ, పక్కా ప్లానింగ్తో ఈ నెట్వర్ను ఛేదించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితులను క్షుణ్ణంగా విచారిస్తున్నామని, వీరి వెనుక ఉన్న మరికొంత మంది సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande