కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్- జూన్ 3న ప్రమాణస్వీకారం
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్- జూన్ 3న ప్రమాణస్వీకారం
DK Shivakumar


బెంగళూరు, 31 మే (హి.స.)

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం సిద్ధరామయ్య డీకే పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా సమర్థించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఏఐసీసీ పరిశీలకులు ప్రకటించారు. అయితే కేవలం పది నిమిషాల్లోనే సీఎల్పీ భేటీ ముగియడం గమనార్హం.

జూన్ 3న ప్రమాణ స్వీకారం

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణస్వీకారోత్సవం జూన్ 3న జరగనుంది. ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జీసీ చంద్రశేఖర్ ప్రకటించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం లోక్భవన్లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే సీఎం ప్రమాణస్వీకారోత్సవ వేదికను లోక్భవన్కు మార్చినట్లు చంద్రశేఖర్ చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవరు కూడా లోక్భవన్కు రావద్దన్నారు. పార్టీ నిర్ణయానికి అందరూ సహకరించాలని చంద్రశేఖర్ కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande