ట్రాన్స్ జెండర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
ట్రాన్స్ జెండర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
సుప్రీం కోర్ట్


న్యూఢిల్లీ, 04 మే (హి.స.)

ట్రాన్స్ జెండర్ (Transgender) వ్యక్తుల హక్కుల రక్షణకు సంబంధించిన 'ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కుల రక్షణ) సవరణ బిల్లు -2026'పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ బిల్లు వ్యక్తుల స్వయం నిర్ణయాధికారాన్ని (Right of Self-Determination) ఉల్లంఘిస్తోందని దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం స్పందించింది. అయితే, ఈ సవరణ బిల్లును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఓ ట్రాన్స్ జెండర్ వ్యక్తి తన లింగ గుర్తింపు (Gender Identity) కోసం ప్రభుత్వం నుంచి ధృవీకరణ పత్రం పొందాలంటే తప్పనిసరిగా వైద్య చికిత్స తీసుకోవాలని ఈ బిల్లు నిబంధన విధిస్తోంది. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదిస్తున్నారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని బెంచ్, ఈ అంశంపై లోతైన విచారణ జరిపేందుకు స్వయంగా సీజేఐ అధ్యక్షతన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande