రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మంత్రి జూపల్లి
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మంత్రి జూపల్లి
మంత్రి జూపల్లి


నాగర్ కర్నూల్, 04 మే (హి.స.)

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పాన్ గల్ మండలం బహుదూర్ గూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రంలలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి కోతలు, తరుగు, కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, సన్న రకం ధాన్యానికి రూ, 500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande